: ఆ ఒక్క నెలలోనే 58.39 లక్షల మంది వినియోగదారులను సంపాదించుకున్న జియో!


ఎంట్రీతోనే అదరగొట్టేసి రికార్డు స్థాయిలో కస్టమర్లను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో మార్చి 31 నాటికి 9.29 శాతం సబ్‌స్కైబర్ మార్కెట్ షేర్ సాధించి, మరోసారి తన సత్తాను చాటింది. ట్రాయ్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో జియో మార్కెట్ షేర్ 8.83 శాతంగా ఉండేది. ఒక్క‌ మార్చి నెలలోనే జియో అదనంగా 58.39 లక్షల మంది కస్ట‌మ‌ర్లను సంపాదించుకుంది.

మ‌రోవైపు వొడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్, ఐడియాలకు కూడా కొంత‌మంది సబ్‌స్కైబర్లు కొత్త‌గా వ‌చ్చి చేరారు. కాగా, టెయిలెండింగ్ ఆపరేటర్లు మాత్రం అదే నెల‌లో భారీ సంఖ్యలో తమ స‌బ్‌స్కైబ‌ర్ల‌ను కోల్పోయాయి. ఆయా కంపెనీలు మొత్తం క‌లిపి 27.7 లక్షల మంది జియో వైపున‌కు మ‌ళ్లారు. దీంతో మార్చి 31 నాటికి జియో వినియోగ‌దారుల సంఖ్య‌ 10.86 కోట్లు అయింద‌ని ట్రాయ్ ప్ర‌క‌టించింది.

  • Loading...

More Telugu News