: చార్ ధామ్ యాత్ర: విరిగిపడ్డ కొండచరియలు.. చిక్కుకుపోయిన 15 వేల మంది యాత్రికులు!
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో ఈ రోజు కొండ చరియలు విరిగిపడ్డాయి. విష్ణు ప్రయాగ్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో 15 వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. దీంతో, పరిస్థితులు మెరుగుపడ్డాక యాత్రికులను వెళ్లేందుకు అనుమతిస్తారు. మరోపక్క ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు శాఖ సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయలైనట్టు సమాచారం లేదు. కాగా, చార్ థామ్ యాత్రలో భాగంగా ఇప్పటికే 2.5 లక్షల మంది యాత్రికులు కేదార్ నాథ్, బదరీ నాథ్, గంగోత్రి, యమునోత్రిని దర్శించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చార్ థామ్ యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని టూరిజం శాఖ మంత్రి సూచించారు.