: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసు: గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిలను నిందితులుగా పేర్కొంటూ ఈడీ చార్జిషీటు దాఖలు
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిలకు మరోసారి షాక్ తగిలింది. గతంలో ఈ కేసులో అధికారులు చేపట్టిన సుదీర్ఘమైన విచారణ ఆధారంగా ఈడీ ఈ రోజు వారిరువురినీ నిందితులుగా పేర్కొంటూ ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలైంది. గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అభియోగంలో పేర్కొంది. వీరివురూ మనీలాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంది. పలు కార్యకలాపాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చినట్లు తెలిపింది.