: ముళ్ల పందిని వేటాడి తిన్న చిరుత ఖతం!


కడుపు నింపుకోవడం కోసం ఓ చిరుతపులి.. ముళ్లపంది జోలికెళ్లి మృత్యువును కొని తెచ్చుకుంది. తమిళనాడులోని కుమరి జిల్లా పేచ్చిపారై అనే ప్రాంతం సమీపంలో కాయల్ కరై అటవీ ప్రాంతం ఉంది. నిన్న కొంతమంది స్థానికులు అక్కడికి వెళ్లగా, నాలుగు సంవత్సరాల ఆడపులి చచ్చి పడిఉండటం గమనించారు. ఈ సమాచారాన్ని అటవీ శాఖాధికారులకు తెలిపారు. వెటర్నరీ డాక్టర్లను తీసుకుని అటవీ శాఖాధికారులు అక్కడికి వెళ్లారు. పులి కళేబరాన్నివైద్యులు పరిశీలించారు. ముళ్ల పందిని వేటాడి తినే సమయంలో చిరుత నోట్లో, కడుపులో ముళ్లు గుచ్చుకుపోయాయన్నారు. దీంతో, చిరుత కడుపులో బలమైన గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు.

  • Loading...

More Telugu News