: రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తాం: పన్నీర్ సెల్వం


త‌న అభిమానుల‌తో సౌతిండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ వ‌రుస‌గా భేటీ అవుతుండ‌డంతో పాటు, ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తుండడంతో ఆయ‌న ఇక రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తార‌ని అంద‌రూ భావిస్తున్నారు. రజనీ ఎంట్రీపై ప‌లువురు త‌మిళ‌నాడు నేత‌లు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్ర నేత, మాజీ ముఖ్యమంత్రి ప‌న్నీర్ సెల్వం ఇదే అంశంపై ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తామని అన్నారు. రజనీ ఓ మంచి వ్యక్తి అని ప‌న్నీర్ సెల్వం అన్నారు.
 
కాగా,  రెండాకుల గుర్తును తమకే కేటాయించాలని తాను ఈ రోజు ఎన్నికల సంఘాన్ని మ‌రోసారి కోరాన‌ని ప‌న్నీర్ సెల్వం అన్నారు. ఇటీవ‌ల‌ ఈ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థి రూ.కోట్ల లావాదేవీలు చేశారని ప‌న్నీర్ సెల్వం ఆరోప‌ణ‌లు చేశారు. ఇక‌ రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడే అభ్యర్థిని బట్టి తమ వ‌ర్గం మద్దతును తెలుపుతామ‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News