: తమిళనాడుకు కావాల్సింది యాక్టరు కాదు డాక్టర్: పీఎంకే నేత రాందాస్


తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరడం, అందుకే, రజనీ తనదైన శైలిలో సమాధానమివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ పై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా తన అభిప్రాయాలను ఇప్పటికే వ్యక్తం చేశారు. తాజాగా, కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి రాందాస్ స్పందిస్తూ, తమిళనాడు రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సింది 'యాక్టరు కాదు డాక్టరు' అన్నారు. రజనీకాంత్ మంచి వాడే అన్న విషయం అందరికీ తెలిసిందేనని, అయినా, కేవలం నటనా నైపుణ్యాలు మాత్రమే సరిపోవన్న విషయం యువతకు తెలుసని అన్నారు. తమిళనాడును పరిపాలించిన యాక్టర్లు ఎంజీఆర్, జయలలిత లు రాష్ట్రాన్నినాశనం చేశారని విమర్శించారు.

  • Loading...

More Telugu News