: వంశధార నిర్వాసితుల భారీ బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్
శ్రీకాకుళం జిల్లా హీర మండలంలో వంశధార నిర్వాసితులు ఈ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తమకు పరిహారం చెల్లించకుండానే ప్రాజెక్టును నిర్మిస్తున్నారని వంశధార నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఎన్నో గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. జగన్‌తో ముఖాముఖిలో మాట్లాడుతూ వారి కష్టాలను చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.