: ఏపీలో కొత్త నిబంధన.. మద్యం సేవించి ప్రమాదాలకు కారకులైతే పదేళ్ల జైలు: డీజీపీ
ఏపీలో రహదారి ప్రమాదాల నివారణ నిమిత్తం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ నేపథ్యంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించడంపై వాహనచోదకులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని, మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన వారికి పదేళ్ల జైలు శిక్ష, లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ప్రమాదం చేస్తే పదేళ్లు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కొత్త నిబంధనను వెంటనే అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులను ఆదేశించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిబంధనను ఈ రోజు నుంచే కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. విధి నిర్వహణలో పోలీసులు తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సాంబశివరావు హెచ్చరించారు.