: విజయవాడ దుర్గ గుడి సమీపంలో భారీ ఎత్తున భవనాల కూల్చివేత
విజయవాడలోని దుర్గ గుడి సమీపంలో భారీ ఎత్తున భవనాలను కూల్చి వేస్తున్నారు. శివాలయం మెట్ల మార్గానికి దిగువ భాగంలో ఉన్న భవనాలన్నింటినీ తొలగిస్తున్నారు. ఈ ఇళ్ల యజమానులకు ఇప్పటికే నష్ట పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం అందజేసింది. భవనాల కూల్చి వేత వల్ల సమకూరే స్థలంలో ప్రసాదాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జేసీబీల సహాయంతో ఈ భవనాలను కూలుస్తుండగా... స్థానికులు ఆసక్తికరంగా వీక్షించారు.