: రూ.3,499కే మైక్రోమ్యాక్స్ నుంచి 4జీ స్మార్ట్ ఫోన్ ... 'భారత్-2' పేరిట విడుదల!


దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ బడ్జెట్ ధరలో 4జీ ఫోన్‌ను విడుద‌ల చేసి ఆక‌ర్షిస్తోంది. ‘భారత్ 2’ పేరుతో కేవ‌లం రూ.3,499కే ఈ ఫోన్‌ను ఈ రోజు విడుద‌ల చేసిన‌ట్లు ఆ సంస్థ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. ఇందులోని ఫీచ‌ర్లు కూడా యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించేలా ఉన్నాయి.

 మైక్రోమ్యాక్స్‌ ‘భారత్ 2’ ఫీచ‌ర్లు...

  •  నాలుగు అంగుళాల డిస్‌ప్లే
  • 1.3 జీహెచ్‌జడ్ స్ప్రెడ్‌ట్రమ్ ప్రాసెసర్
  • 512 ఎంబీ ర్యామ్
  • 4 జీబీ ఇంటర్నల్ మెమొరీ  (32 జీబీల వరకు పెంచుకునే సదుపాయం)
  • డ్యూయల్ సిమ్
  • 2 ఎంపీ వెనక, వీజీఏ ఫ్రంట్ కెమెరా
  • ఎఫ్ఎం రేడియో
  • ఆండ్రాయిడ్ 6.0
  • 1,300 ఎంఏహెచ్ బ్యాటరీ సామ‌ర్థ్యం

  • Loading...

More Telugu News