: 30న దేశ వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్!
ఈ- పోర్టల్ విధానంలో మందులు విక్రయించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 30న దేశ వ్యాప్తంగా బంద్ కు పిలుపు నిచ్చారు. ఈ బంద్ లో తాము కూడా పాల్గొంటున్నట్టు తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రిస్క్రిప్షన్, మందుల అమ్మకాలకు సంబంధించిన బిల్లును ఈ- పోర్టల్ లో అప్ లోడ్ చేయాలన్న నిబంధన ప్రజలకు ఇబ్బందిగా మారుతుందన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వినియోగదారులకు అవసరమైన అత్యవసర మందులను విక్రయించలేమని, తద్వారా రోగులకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా మందుల విక్రయాలను ఆపాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.