: మాజీ భార్య కోసం అత్యంత ఖరీదైన ఫ్లాట్ కొన్న బాలీవుడ్ హీరో!
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన మాజీ భార్య సూసాన్ ఖాన్ కు అత్యంత ఖరీదు చేసే ఓ ఫ్లాట్ కొన్నట్టు సమాచారం. ముంబయిలో హృతిక్ రోషన్ నివాసం ఉంటున్న జుహు ప్రాంతానికి కొంచెం దూరంలో రూ.25 కోట్లు ఖరీదు చేసే ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా, ఈ బాలీవుడ్ జంట విడిపోయినప్పటికీ తమ పిల్లల కోసం పార్టీలు, విహార యాత్రలకు కలసి వెళుతున్న విషయం తెలిసిందే.