: కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ను గద్దె దించుతా: లాలూ ప్రసాద్ యాదవ్
ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మోదీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగదని, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును గద్దె దించుతామని రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. తన వారసులు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, చట్టబద్ధంగా ఆస్తులు కూడబెట్టారని అన్నారు. తనపై, తన వారసులపై బురదజల్లితే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకే తనపై అభియోగాలు మోపారని, ఆర్ఎస్ఎస్ కూడా తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని లాలూ మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలను తిప్పికొడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. బీజేపీపై పోరాడేందుకు, భవిష్యత్ కార్యాచరణ కోసం ఆగస్టు 27న పాట్నాలోని గాంధీ మైదాన్ లో ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. భావ సారూప్యం కలిగిన పార్టీల నాయకులను ఈ ర్యాలీకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.