: ‘బాహుబలి-2’ని ఇంతగా చూస్తున్నారు.. కన్నడిగులు ఆందోళన చేయాలి: వర్మ


‘బాహుబలి-2’ చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ల‌పై ట్వీట్లు చేసేస్తోన్న వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ.. ఈ సినిమా విడుద‌ల‌ను అడ్డుకుంటామ‌ని ముందుగా ప్ర‌క‌టించిన క‌న్న‌డిగుల‌పై తాజాగా మండిప‌డ్డాడు. తెలుగు సినిమా బాహుబలి-2 క‌ర్ణాట‌క‌లో అక్క‌డి సినిమాల కంటే పెద్ద విజ‌యాన్ని సాధించింద‌ని, డబ్బింగ్‌ సినిమాలను అడ్డుకునే కన్నడిగుల ప్రయత్నాన్ని ఓ తెలుగు స్ట్రయిట్ సినిమా చాలా అప్సెట్ చేసిందని పేర్కొన్నాడు. దీంతో క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ఓ మంచి సినిమా మాత్రమేనని అర్థమవుతోందని అన్నాడు. తమ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తమ భాషలో వచ్చిన సినిమా కంటే తెలుగులో వచ్చిన బాహుబలినే ఎక్కువ సార్లు చూస్తున్నందుకు కర్ణాటక వాసులంతా ఆందోళన చేపట్టాలని ట్వీట్ చేశాడు.  








  • Loading...

More Telugu News