: జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి
వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా నిలిచేందుకు వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. జిల్లాలోని రణస్థలంలో ఆయనకు వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసిరెడ్డి వరద రామారావు వైసీపీలో చేరారు. పార్టీ అధినేత జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మరికొంత మంది స్థానిక నేతలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వంశధార ప్రాజెక్టు వల్ల నిర్వాసితులుగా మారిన 13 గ్రామాల బాధితులకు అండగా నిలిచేందుకు శ్రీకాకుళం పర్యటనకు జగన్ వచ్చారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి బాధితులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సాయంత్రం హీరమండలంలో నిర్వహిస్తున్న బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు.