: అరుదైన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్న మార్క్ జుకెర్ బర్గ్


తన జీవితంలో చోటుచేసుకున్న అరుదైన క్షణాలను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ తన ఖాతాలో పంచుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో వివరాల్లోకి వెళ్తే...2006లో హార్వార్డ్ యూనివర్సిటీలో సీటు సంపాదించిన సందర్భంగా, తన తండ్రి తీసిన వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోలో తనకు సీటు ఖరారైన సంగతిని ఆనందంగా పంచుకోవడం కనిపిస్తుంది.

 అయితే 2006లో గ్రాడ్యుయేషన్ మధ్యలో వదిలేసిన జుకెర్ బర్గ్ ఫేస్ బుక్ ను రూపొందించి, ప్రపంచంలోనే అంత్యంత ధనవంతుల్లో ఐదవ స్థానంలో నిలిచాడు. ఈ వీడియో పోస్టు చేసిన జుకెర్ బర్గ్, ‘నేను హార్వార్డ్‌ కు ఎంపికయినప్పుడు మానాన్న తీసింది ఈ వీడియో. వచ్చే వారం నేను నా డిగ్రీ తీసుకునేందుకు అదే వర్సిటీకి వెళుతున్నాను’ అంటూ పోస్టు చేశాడు. అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

  • Loading...

More Telugu News