: హైదరాబాద్ శివారులో ప్రయాణికులను చితకబాది.. బస్సులోంచి దించేసిన డ్రైవర్
హైదరాబాద్ శివారులో ప్రయాణికులతో ఓ బస్సు డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరిన కొందరు కూలీలపై సదరు బస్సు డ్రైవర్ చేయిచేసుకోవడమే కాక వారిని కిందకు దించేసి, దిక్కున్న చోట చెప్పుకోండని చెప్పేసి బస్సుని తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రయాణికులు రోడ్డుపైనే తిండితిప్పలు లేక కొన్ని గంటల పాటు ఉండిపోవలసి వచ్చింది. తమను ఆ బస్సు డ్రైవర్ చితకబాది, ఎల్బీనగర్ దాటగానే బస్సులోంచి దించేశాడని, ఇక్కడ ఎందుకు దింపుతున్నావని అడిగితే దురుసుగా ప్రవర్తించాడని ఆ ప్రయాణికులు అంటున్నారు. ఆ ప్రైవేటు బస్సు ఏ ట్రావెల్స్‌కు చెందినది అన్న విషయం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.