: ఆమె ధరించిన డ్రెస్ చూడండి... దాని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది!


పెన్సిల్వేనియాలోని ఎలిజబెత్ టౌన్ కి చెందిన ఎమిలీ సెయిల్‌ హమెర్‌ కు క్రియేటివ్ గా ఏదైనా ప్రయత్నించడం చాలా ఇష్టం. అది కూడా ఎందుకూ పనికిరావనుకున్న వస్తువులతో సరికొత్త వస్తువులను రూపొందించడంలో ఉండే మజానే వేరంటుందామె. అందుకే చాలా కష్టపడి ఒక డ్రెస్ ను రూపొందించింది. అంత కష్టపడడానికి ఏముంది? అంటే... సుమారు పదివేల చాక్లెట్ కవర్లను... ఐదేళ్ల పాటు కష్టపడి సేకరించి ఒక అద్భుతమైన డ్రెస్‌ ను రూపొందించింది. ఆ డ్రెస్సే ఇక్కడ ఆమె ధరించినది.

ఆమె భర్తకు స్టార్‌ బరెస్ట్‌ క్యాండీ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. తనను తొలిసారి కలిసినప్పుడు కూడా తన భర్త ఆ చాక్లెట్లనే బహుమతిగా ఇచ్చాడు. ఆ క్యాండీ చాక్లెట్ కవర్ లను చూసి, భలే ఉన్నాయి, వాటితో ఏదైనా చేయాలని ఎమిలీ భావించింది. దీంతో తన భర్తతో పాటు, ఆ చాక్లెట్లు తినే పరిచయస్తులందరికీ చాక్లెట్ కవర్లు పడేయొద్దని తెలిపింది. ఇలా వివిధ రంగుల్లో ఉన్న స్టార్ బరెస్ట్ క్యాండీ చాక్లెట్ కు సంబంధించిన పది వేల కవర్లను సేకరించింది. వాటన్నింటినీ జాగ్రత్తగా ఒకదానికొకటి కలుపుతూ చైన్ లా అల్లింది. వాటిని ఎలాస్టిక్ దారంతో కుట్టి డ్రెస్ ను తయారు చేసింది. ఆ డ్రెస్ ఇప్పుడామెకు బోల్డంత క్రేజీని తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News