: ధోనీ గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: బెన్ స్టోక్స్ ఆసక్తికర ట్వీట్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ చేసిన ట్వీట్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పూణే సూపర్ జెయింట్ కెప్టెన్సీ నుంచి ధోనీని తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టు యాజమాన్యంపై దుమ్మెత్తిపోశారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ధోనీ మాత్రం మౌనంగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆటగాడు బెన్ స్టోక్స్ తన సామాజిక మాధ్యమంలో "ధోని గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరైనా వెళ్లొచ్చు. ఏ సలహాలైనా తీసుకోవచ్చు. అందరితో కలుపుగోలుగా ఉంటాడు. అతడి క్రికెట్ పరిజ్ఞానం ప్రత్యేకం. ఫీల్డింగ్ కూర్పుపై అతడికి గొప్ప పట్టు ఉంది. స్మిత్ మా కెప్టెన్ అయినప్పటికీ.. ధోనీయే ఈ విషయంలో అత్యుత్తమమని అతడికి కూడా తెలుసు. ఫీల్డింగ్ ఏర్పాట్లపై ధోనీతో మాట్లాడే అతను నిర్ణయాలు తీసుకుంటాడు’’ అని తెలిపాడు.