: రజనీ దువ్వెన తీశాడు... అభిమానులు కేరింతలు కొట్టారు!
నేడు చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానులతో రజనీ సమావేశమైన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. రజనీ ప్రసంగం ముగిసిన తరువాత, అభిమానులతో ఫోటో సెషన్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ కుర్చీలో కూర్చుని ఉంటే, అభిమానులు ఒక్కొక్కరుగా వచ్చి ఆయన పక్కన నిలబడి ఫోటోలు దిగుతున్నారు. గత ఐదు రోజులుగా రోజుకు దాదాపు 600 నుంచి 700 మందితో ఆయన ఫోటోలు దిగుతున్నారు. నేడు ఫొటో సెషన్ కు ముందు ఆయన ఓ దువ్వెన తీసి తనదైన స్టయిల్ లో జుట్టును దువ్వుకోవడంతో దాన్ని చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. రజనీ కూడా నవ్వుతూ, మరోసారి తన జుట్టును సవరించుకుని ఫోటోలకు సిద్ధమయ్యారు.