: భావోద్వేగానికి గురైన అఖిలప్రియ!
ఆళ్లగడ్డలోని మార్కెట్ యార్డులో నిన్న టీడీపీ మినీ మహానాడు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనను, ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు దత్త బిడ్డలుగా భావిస్తున్నారని చెప్పారు. నంద్యాల నియోజకవర్గానికి రూ. 500 కోట్లు ఇచ్చారని, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి రూ. 152 కోట్లను మంజూరు చేశారని, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చారని తెలిపారు. భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనుకున్న తరుణంలోనే ఆయన చనిపోయారని... దీంతో, తనకు ఆ పదవి ఇచ్చి దత్త పుత్రికగా చంద్రబాబు చూసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి తన పట్ల చూపుతున్న ఆదరణ మరిచిపోలేనిదని అన్నారు.