: నాన్నకి ఆ టైమొచ్చింది.. అందుకే వెళ్లిపోయారు!: తండ్రిని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న హీరో సుశాంత్


అక్కినేని కుటుంబంలోని నవతరం హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్య భూషణ్ రావు నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన తండ్రితో అనుబంధాన్ని, ఆయనతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సుశాంత్, తన సోషల్ మీడియా ద్వారా హృదయాన్ని తాకేలా స్పందించాడు. ఆయన చాలా సరదాగా ఉండేవారని, చాలా నెమ్మదైన వ్యక్తని, ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉంటారని చెప్పుకొచ్చాడు. స్నేహితులు, కుటుంబంతో ఆయన గడిపిన మధుర జ్ఞాపకాలు తన మదినిండా ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయని చెప్పాడు.

ఆయనకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే సమయం వచ్చిందని, అందుకే వెళ్లిపోయారని అన్నాడు. ఆయన జీవితంలో తామంతా భాగమైనందుకు సంతోషంగా ఉందని అంటూనే, తండ్రిని చాలా మిస్సవుతున్నానని, ఈ సమయంలో తన కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్న సన్నిహితులు, బంధువులకు ధన్యవాదాలని అన్నాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలసి చిన్నప్పుడు దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు సుశాంత్.

  • Loading...

More Telugu News