: అనూహ్యంగా అవకాశం... చాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి మనీష్ పాండే అవుట్, దినేష్ కార్తీక్ ఇన్


జూన్ ఆరంభం నుంచి ఇంగ్లండ్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు స్వల్పంగా మారింది. ఐపీఎల్-10 సీజన్ లో భాగంగా ఓ మ్యాచ్ లో మనీష్ పాండే గాయపడటంతో, అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ దినేష్ కార్తీక్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. గుజరాత్ లయన్స్ తరఫున ఆడుతూ, మంచి ఫామ్ లో ఉన్న కార్తీక్, ఈ సీజన్ లో 14 మ్యాచ్ లలో 361 పరుగులు చేశాడు. దీంతో అతనికీ అవకాశం లభించింది. కాగా, మనీష్ పాండే పక్కటెముకల గాయం కారణంగా బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా జట్టు డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతుండగా, తొలి మ్యాచ్ ని జూన్ 4న పాకిస్థాన్ తో ఆడాల్సి వుంది.

  • Loading...

More Telugu News