: నో డౌట్...నేను తమిళుడినే!: రజనీకాంత్ స్పష్టీకరణ
'40 ఏళ్లుగా తమిళనాడులోనే ఉంటున్నాను.. నేను తమిళుడినే'నని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తిరుచ్చి, అర్యళూరు, తిరంబళూర్ జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. విమర్శలు సర్వసాధారణమని ఆయన చెప్పారు.
మన వ్యవస్థ (సిస్టమ్) లోనే లోపాలు ఉన్నాయని ఆయన చెప్పారు. చెడ్డ రాజకీయ నాయకులతోపాటు, నలుగురు మంచి నాయకులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. కాగా, అభిమానులతో ఐదో రోజు సమావేశమవుతున్న రజనీ... నేటి సాయంత్రంలోపు రాజకీయ రంగప్రవేశంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.