: అవును! కేజ్రీవాల్ కు 2 కోట్లు ఇచ్చాను... కానీ అందుకోసం కాదు!: పారిశ్రామిక వేత్త శర్మ


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని మాజీ మంత్రి కపిల్ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ ఆ డబ్బును తనముందే తీసుకున్నారని ఆయన చెబుతున్నారు. దీనిపై కపిల్ మిశ్రా పేర్కొంటున్న సదరు పారిశ్రామిక వేత్త శర్మ స్పందించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, 'అవును! కేజ్రీవాల్ కు 2 కోట్లు ఇచ్చాను... కానీ కపిల్ మిశ్రా ఆరోపిస్తున్నట్టు లంచం కాదు' అన్నారు.

పార్టీకి విరాళంగా 2 కోట్ల రూపాయలు ఇచ్చానని, ఈ విషయం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరికీ తెలుసని ఆయన స్పష్టం చేశారు. కపిల్ మిశ్రా కావాలని పలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తానిచ్చిన మొత్తాన్ని డీడీ రూపంలో ఇచ్చానని ఆయన తెలిపారు. ఇందులో ఎలాంటి అవినీతికి తావులేదని ఆయన చెప్పారు. కపిల్ మిశ్రా పదేపదే చేస్తున్న ఆరోపణలతో విసుగు చెంది ఇలా తాను బయటకు రావాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News