: షియోమీ రెడ్‌మి నోట్ 4 సరికొత్త రికార్డు.. ఈ ఏడాది అమ్మకాల్లో టాప్!


చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారత్‌లో మరో రికార్డు సృష్టించింది. ఆ సంస్థ ఇటీవల బడ్జెట్ ధరలో విడుదల చేసిన రెడ్‌మి నోట్ 4 ఫోన్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్‌గా రికార్డు నెలకొల్పింది. విడుదలైన 45 రోజుల్లోనే 10 లక్షలకు పైగా ఫోన్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది 70 లక్షల రెడ్‌మి నోట్ 4 ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ సందర్భంగా ఆ సంస్థ ఇండియా చీఫ్ మనుకుమార్ జైన్ తెలిపారు. ఆకట్టుకునే ఫీచర్లు, అందుబాటు ధరలో ఉండడమే నోట్ 4 అమ్మకాల ప్రభంజనానికి కారణమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News