: తెలుగు రాష్ట్రాలకు వడగాల్పుల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన


భానుడు రోజురోజుకు నిప్పులు కురిపిస్తుండడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. తీవ్రమైన ఎండలతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు బయటకు వచ్చేముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో బయటకు రాకుండా ఉండాలని సూచించాయి.

మరోవైపు మణుగూరు, మచిలీపట్నంలో ఉష్ణోగ్రత 47 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక రామగుండం బొగ్గు బావుల్లో అయితే ఏకంగా 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని  పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మరో రెండురోజులపాటు అసాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గాలిలో కదలిక, తేమ శాతం తగ్గిపోవడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని తెలిపారు.

  • Loading...

More Telugu News