: లవ్ సింబల్‌లో వజ్రం.. రూ.100 కోట్లకు అమ్ముడుపోయిన వైనం!


ప్రపంచంలోనే అతిపెద్దదైన, పగుళ్లు లేని హృదయాకార వజ్రాన్ని స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో క్రిస్టీన్ సంస్థ బుధవారం వేలం వేసింది. ముత్యాలతో పొదిగిన హారంలో 92 క్యారెట్ల ఈ మేలిమి వజ్రం ధగధగ మెరుస్తోంది. వేలంలో ఈ వజ్రం దాదాపు రూ.100 కోట్లకు అమ్ముడుపోయింది. హృదయాకార వజ్రాల్లో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన వజ్రంగా ఇది రికార్డుల కెక్కింది. 2011లో 56.15 క్యారెట్లున్న లవ్ సింబల్ వజ్రం రూ.63 కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పటి వరకు ఇదే అత్యంత ఎక్కువ ధర కాగా, తాజా వజ్రం ఏకంగా వంద కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి ఆ రికార్డును చెరిపేసింది.

  • Loading...

More Telugu News