: న్యూయార్క్‌లో బీభత్సం సృష్టించిన కారు.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు.. ఉగ్రకోణంపై పోలీసుల ఆరా!
అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు పాదచారులపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. పర్యాటక ప్రాంతంగా పేరున్న సెవెంత్ ఎవెన్యూ 45వ స్ట్రీట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారు ఒక్కసారిగా పైకి దూసుకురావడంతో చూసిన జనం బెంబేలెత్తి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎఫ్‌బీఐ అధికారులు ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఇందులో ఉగ్ర కోణం ఉందా..? అనే దానిపై దర్యాప్తు చేప్టటారు. 26 ఏళ్ల కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.