: కేసీఆర్ మానవ రూపంలో ఉన్న రాక్షసుడు: కోమటి రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ మానవ రూపంలో ఉన్న రాక్షసుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జీవితం మొత్తం మోసాలమయమని ఆయన విమర్శించారు. తమ జిల్లా నల్గొండలో రౌడీయిజం ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. ఇక్కడ మాజీ మావోయిస్టులే ఎమ్మెల్యేలుగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు ఆహ్వానించడం వల్లే తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని, అయితే పోలీసులు తనను ఒక్కడ్ని రమ్మనడంతో ఆశ్చర్యమేసిందని ఆయన తెలిపారు. తనపై టీఆర్ఎస్ కార్యకర్తలు పథకం ప్రకారం దాడి చేశారని ఆయన తెలిపారు.