: సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఫోన్ చేశారు. శ్రీలంకలో ఏపీ ప్రభుత్వానికి 500 ఎకరాలు కేటాయించేందుకు మైత్రిపాల సంసిద్ధత వ్యక్తం చేశారు. శ్రీలంకలో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మైత్రిపాల ముఖ్యమంత్రిని కోరారు. అందుకు స్పందించిన చంద్రబాబు, త్వరలోనే శ్రీలంకకు ప్రభుత్వ ప్రతినిధుల బృందాన్ని పంపుతానని చెప్పినట్టు సమాచారం. శ్రీలంక ప్రతినిధులతో సమన్వయం కోసం పారిశ్రామిక, పర్యాటక శాఖల నుంచి బృందాన్ని త్వరలోనే పంపాలని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది.