: ఏపీలో వర్షాలు.. తెగిపడ్డ విద్యుత్ వైర్లు.. పిడుగుపాటుకు ఒకరి మృతి!


ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పెనుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఐరాల మండలం నాంపల్లి దగ్గర పిడుగుపడి ఒకరు మృతి చెందారు. గంగాధర మండలంలో పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాశం జిల్లా కంభంలో ఈదురుగాలులు వీయడంతో సబ్ స్టేషన్ లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో, ఏడు సబ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం మండలం కసిరెడ్డిపాలెంలో చెక్ డ్యామ్ దగ్గర పిడుగుపడింది. అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

  • Loading...

More Telugu News