: ఏపీలోని సాఫ్ట్ వేర్ కంపెనీలకు అంత సత్తా లేదు: మంత్రి అమర్ నాథ్ రెడ్డి
ఏపీలోని సాఫ్ట్ వేర్ కంపెనీలపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. విశాఖపట్టణం జిల్లా పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో స్థానిక నోవటెల్ హోటల్లో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని సాఫ్ట్ వేర్ కంపెనీలకు పెద్ద ప్రాజెక్టులు చేయగలిగే సత్తా లేదని, చేయగలమని నిరూపించుకుంటేనే ప్రభుత్వానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ సర్వీసులు ఇక్కడి వారికి కేటాయిస్తామని అన్నారు. అనంతరం సీఐఐ విశాఖ చాప్టర్ చైర్మన్ తిరుపతి రాజు, స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధి సురేష్ కుమార్ మాట్లాడారు. నక్కపల్లి, అచ్యుతాపురం ఎస్ఈజెడ్ లలోని పరిశ్రమలను మంత్రి పరిశీలించారు.