: సీనియర్ సినీ నటుడు కె.కె.శర్మ మృతి
సీనియర్ సినీ నటుడు కె.కె.శర్మ (84) ఈ రోజు మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను రేపు హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, జూనియర్ ఆర్టిస్ట్ గా తన నట జీవితాన్ని శర్మ ప్రారంభించారు. 'కంచుకోట' చిత్రం ఆయన నటించిన తొలి చిత్రం. సుమారు ఐదు వందల చిత్రాల్లో నటించిన శర్మ స్నేహితులతో కలసి, ‘గోల నాగమ్మ’ అనే చిత్రాన్ని నిర్మించారు. సినీ రంగంలోకి రాకముందు, రైల్వే శాఖలో పని చేసేవారు. సినిమాల్లో నటించాలనే తపనతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ రంగంలో స్థిరపడ్డారు.