: గోవాలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి నదిలో పడిపోయిన 50 మంది
దక్షిణ గోవాలో ఈ రోజు సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కర్కోరం ప్రాంతంలోని పాదచారుల వంతెన కూలడంతో సుమారు 50 మంది నదిలో పడిపోయారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. నదిలో పడిపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.