: బాహుబలి-2 ‘భళి భళి రా భళి..’ పాట పూర్తి వీడియో విడుదల.. మీరూ చూడండి!
భారతీయ సినిమా చరిత్రలోని అన్ని రికార్డులను బద్దలు కొడుతూ దూసుకువెళుతున్న ‘బాహుబలి 2’ చిత్రంలోని ‘భళి భళి రా భళి..’ పాట పూర్తి వీడియోను ఆ సినిమా టీమ్ ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్పుడే మూడు లక్షల మంది వీక్షించారు. అద్భుతంగా తెరకెక్కించిన ఈ పాట భారత్‌లో ట్విటర్ ట్రెండింగ్‌లో మూడోస్థానంలో నిలిచింది. బాహుబలి ప్రభాస్ ఏనుగుపైకి ఎక్కి బాణం వేయడం, శివగామి ఒడిలో చిన్నపిల్లాడిలా పడుకోవడం, బాహుబలి1 లో అమరేంద్ర బాహుబలి చేసిన సాహసాలు ఈ పాటలో కనపడతాయి. ప్రభాస్ గుర్రపు స్వారీ, మాహిష్మతి ప్రజల బాహుబలి నినాదాలను కూడా ఈ పాటలో చూపించారు. కీరవాణి ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను మీరూ చూడండి...