: మళ్లీ ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నిండితే ఏం లాభం? : ప్రొ.కోదండరాం
టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో మళ్లీ ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నిండితే ఏం లాభం? అని నిలదీశారు. రైతుల పట్ల సర్కారు దారుణంగా ప్రవర్తిస్తోందని చెప్పారు. మద్దతు ధర అడిగితే రైతులకు సంకెళ్లు వేయటం దారుణమని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని ఆయన ప్రజాసంఘాలకు పిలుపునిచ్చారు. కలిసికట్టుగా పనిచేస్తే ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందని అన్నారు. గౌరవంగా బతికేందుకే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, ప్రశ్నించే హక్కును కాలరాసేందుకు ప్రభుత్వం ధర్నా చౌక్‌ను తరలిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.