: రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వాళ్లం ఒకటే: వెంకయ్యనాయుడు
రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వాళ్లం ఒకటేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, సామరస్య పూర్వక వాతావరణంలో ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపిణీ చేసుకోవాలని సూచించారు. ఏకీకృత సర్వీసుల విషయంలో రెండు రాష్ట్రాల మంత్రులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో తాను మాట్లాడానని త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అన్నారు.