: రాజకీయాలపై ప్రశ్నలు వద్దు: రజనీకాంత్
రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలేవీ తనను అడగవద్దని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. రాజకీయాల గురించి ఇటీవల ఆయన చేసిన ప్రకటనపై విలేకరులు ప్రశ్నించగా రజనీ పై విధంగా వ్యాఖ్యానించారు. తన జీవితం దేవుడి చేతుల్లో ఉందని, ఆయన తన తలరాతను ఎలా రాశారో తనకు తెలియదని, అయితే, దేవుడు తనపై ఉంచిన బాధ్యతలను మాత్రం తప్పకుండా నెరవేరుస్తానని అన్నారు. రాజకీయాల్లోకి రానంత మాత్రాన అభిమానులు నిరాశకు గురికావద్దని రజనీ సూచించారు. కాగా, కొన్ని రోజులుగా రజనీకాంత్ తన అభిమానులను కలుసుకుంటున్న విషయం తెలిసిందే. మళ్లీ తన అభిమానులను ఎప్పుడు కలిసే విషయం త్వరలోనే తెలియజేస్తానని రజనీ పేర్కొన్నారు.