: నేషనల్ జాగ్రఫిక్ బీ కాంపిటేషన్ విజేత భారత సంతతి విద్యార్థి!


ప్రతిష్టాత్మక నేషనల్ జాగ్రఫిక్ బీ కాంపిటేషన్ లో భారత సంతతి విద్యార్థి ప్రణయ్ వరదా తన సత్తా చాటాడు. ఈ కాంపిటీషన్ లో విజేతగా నిలిచిన ప్రణయ్ 50,000 అమెరికన్ డాలర్ల నగదు బహుమతి సాధించాడు. ఈ సందర్భంగా పద్నాలుగేళ్ల  ప్రణయ్ మాట్లాడుతూ, ఈసారి ఈ పోటీలో గెలుస్తాననే నమ్మకంతో వచ్చానని, అదే, నిజమైందని చెప్పాడు. ఈ విజయం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నానని, విజయానందంలో ఉన్నానని ప్రణయ్ అన్నాడు. కాగా, ఈ కాంపిటీషన్ లో న్యూజెర్సీకి చెందిన మరో భారత సంతతి విద్యార్థి వేద భట్టారామ్ మూడో స్థానంలో, విస్కాన్సిన్ కు చెందిన థామస్ రైట్ రన్నరప్ గా నిలిచారు. కాగా, గత ఏడాది నిర్వహించిన ఈ కాంపిటీషన్ లో ప్రణయ్ వరదా రన్నరప్ గా నిలిచాడు.  

  • Loading...

More Telugu News