: గుంటూరులో మిర్చి లారీ దగ్ధం.. కాలిపోయిన 260 మిర్చి బస్తాలు
మిర్చి లోడుతో వెళ్తున్న ఓ లారీ ప్రమాదానికి గురై దాదాపు 260 మిర్చి బస్తాలు తగలబడిపోయిన ఘటన గుంటూరు జిల్లా బుడంపాడు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మిర్చి బస్తాలు కాలిపోవడంతో ఆ ప్రాంతంలో ఘాటువాసన వచ్చేసింది. డ్రైవర్ లారీని జాతీయ రహదారి పక్కన ఆపి, మిర్చి బస్తాలు కిందపడిపోకుండా ఉండేందుకు మోకులు బిగిస్తున్నాడు. అదే సమయంలో విద్యుత్ తీగలు మిర్చి బస్తాలకు తగలడంతో మంటలు వ్యాపించి ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో డ్రైవర్ అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేశారు.