: ‘ఇండియా’ ఎంత ముద్దుగా ఉందో.. ఆమె తగిలించుకున్న బుల్లి బ్యాగ్‌లో ఏముందో?: విరాట్ కోహ్లీ


భారత్ అంటే ఎంతో ఇష్ట‌ప‌డే ప్రముఖ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌, ముంబయి ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్ త‌న కూతురికి ఇండియా అని పేరుపెట్టుకున్న విష‌యం తెలిసిందే. త‌రుచూ త‌న కూతురి చేష్ట‌ల‌పై ట్విట్ట‌ర్‌లో ట్వీట్లు చేసే ఆయ‌న తాజాగా మ‌రో ఆసక్తిక‌ర ట్వీట్ చేశాడు. ఆయ‌న త‌న కూతురు ఇండియాని ఓ రోజు సరదాగా బయటికి తీసుకెళ్లగా అక్క‌డ ఆమెకు విరాట్‌ ప్యూమా కోసం చేసిన యాడ్‌ పోస్టర్ క‌నిపించింది. ఆ పోస్టర్ వ‌ద్ద‌కు వెళ్లిన ఇండియా విరాట్‌ ఫొటో పట్టుకుని తెగ మురిసిపోయింది. ఈ సంద‌ర్భంగా జాంటీ ఆమె ఫొటోను తీశాడు. ‘విరాట్‌కి మరో అభిమాని దొరికినట్టుంది’ అని ట్వీట్‌ చేశాడు. దీనిపై స్పందించిన విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. 'ఇండియా ఎంత ముద్దుగా ఉందో' అని అన్నాడు. 'ఇంతకీ ఆమె తగిలించుకున్న బుల్లి బ్యాగ్‌లో ఏముందో?' అని ట్విట్ట‌ర్‌లో ప్రశ్నించాడు. ఈ పోస్టులు అభిమానుల‌ను అల‌రిస్తున్నాయి.  



  • Loading...

More Telugu News