: మందుబాబులకు ఇబ్బందే!.. విజయవాడలో బీరు సరఫరాకు అంతరాయం.. రేపట్నుంచి దొరకనట్టే!
ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడ పరిధిలో లిక్కర్ డిస్టిలరీలలో సాంకేతిక లోపం ఏర్పడింది. సర్వర్లు మొరాయించడంతో బీరు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే విజయవాడలోని బార్లలో బీరు నిల్వలు తగ్గిపోయాయి. ఉన్న స్టాకు ఈ రాత్రికి అయిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బార్ యాజమాన్యాలు మాట్లాడుతూ, రేపటి నుంచి బీరు కొరత ఏర్పడుతుందని తెలిపాయి. వేసవి కావడంతో మందుబాబులంతా బీరు వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో, బీరుకు డిమాండ్ బాగా పెరిగింది. వచ్చిన స్టాక్ వచ్చినట్టే అయిపోతోంది. ఇప్పుడు నెలకొన్న సాంకేతిక సమస్య... బీరు ప్రియులను నిరాశకు గురి చేస్తోంది.