: కుల్‌భూషణ్ జాదవ్ భారత్‌కు తిరిగి వస్తారు: అటార్నీ జనరల్ ఆశాభావం
కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ విధించిన మరణశిక్ష కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి స్పందించారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం తుది తీర్పు కూడా భారత్‌కు అనుకూలంగానే వస్తుందని, కుల్‌భూషణ్ జాదవ్ తిరిగి భారత్‌కు వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర తీర్పు పాక్ తీరుని ఎండగట్టిందని, ఇది భారత్‌కు పెద్ద విజయమని అన్నారు. పాకిస్థాన్ తీరుని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం ముందు బట్టబయలు చేసిందని, భారత విదేశాంగ శాఖ చేసిన కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు.