: శునకాలు మనుషులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాయట!


యజమానికి విశ్వాసంగా ఉండే పెంపుడు జంతువుల్లో శునకాలు మొదటి వరుసలో ఉంటాయనేది జగమెరిగిన సత్యం. తన యజమానినో, ఇంట్లో వ్యక్తులనో చూసీచూడగానే తోకాడిస్తూ, వాళ్ల దగ్గరకు వెళ్లి తమ ప్రేమను ఒలకబోసే శునకాల గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శునకాలు తమ ఉద్దేశాన్ని యజమానికి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాయని హంగేరి శాస్త్రవేత్తలు తెలిపారు. ఏ విధంగా వ్యక్తం చేస్తాయంటే.. శునకాలు మొరిగే విధానంలో, తీవ్రతలో తేడాలు, గుర్రుమంటూ చేసే శబ్దాన్ని అనుసరించి అర్థాలు మారిపోతాయని ఆ పరిశోధనలో తేలింది. శునకం ఒక్క అరుపులో మొత్తం 63 రకాల భావాలను పలికిస్తుందన్నారు. మరో విషయం కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది. పెంపుడు కుక్కల మనోగతం తెలుసుకునే శక్తి పురుషులతో పోలిస్తే మహిళలకే ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Loading...

More Telugu News