: బుల్లితెరపై ‘దేవసేన’గా అలరించనున్న హీరోయిన్ కార్తీక!
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమాలో అనుష్క పోషించిన దేవసేన పాత్రకు ఎంతటి గుర్తింపు వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో ఓ పాత్ర బుల్లితెరపై కూడా కనపడనుంది. దేవసేన పేరుతో బుల్లితెరపై హీరోయిన్ కార్తీక కనిపిస్తుంది. విజయేంద్రప్రసాద్ బుల్లితెరకు అందిస్తున్న ఓ సీరియల్‌లో ‘దేవసేన’ పాత్రలో కార్తీక నటిస్తోంది. రంగం వంటి హిట్ సినిమాలో నటించినప్పటికీ కార్తీకకు సినిమాల్లో అంతగా గుర్తింపురాలేదు. ఇప్పుడు ఆమె దేవసేనగా బుల్లితెరపై ఎలా అలరిస్తోందో చూడాలి. కార్తీక తెలుగులో జోష్, దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఈ అమ్మడుకి అంతగా అవకాశాలు రావడం లేదు.