: అమృత్‌సర్‌కు 320 కి.మీ.దూరంలో.. రహస్యంగా అణ్వాయుధాలను నిల్వచేస్తున్న పాకిస్థాన్
భారత్‌ను దెబ్బతీయాలని ఎన్నో కుట్రలు పన్నే పాకిస్థాన్.. ఖైబర్ పష్తూన్‌క్వా సమీపంలోని పీర్ థాన్ పర్వతం దగ్గర షహీన్-3 బాలిస్టిక్ మిసైల్స్‌ను రహస్యంగా మోహరించిందని తెలుస్తోంది. ఈ ప్రాంతం మనదేశంలోని అమృత్‌సర్‌కు 320 కి.మీ. దూరంలో, చండీగఢ్‌కు 520 కి.మీ. దూరంలోనూ, న్యూఢిల్లీకి 720 కి.మీ. దూరంలో ఉంటుంది. పీర్ థాన్ పర్వతం దగ్గర పాక్ రహస్యంగా అణ్వాయుధాలను నిల్వచేస్తోందని సమాచారం. ఈ విషయాన్ని ఉపగ్రహం ద్వారా మిలిటరీ ఇంటెలిజెన్స్ పసిగట్టింది. అధికారులు భావిస్తున్నట్లు పాకిస్థాన్ ఈ చర్యకు పాల్పడితే గనుక మనదేశానికి ముప్పు పొంచి ఉంటుంది. పాక్ మోహరించిందని అనుమానిస్తోన్న ఈ మిస్సైల్స్‌తో 2,750 కి.మీ. దూరంలోని లక్ష్యాలను సమర్థంగా ఛేదించవచ్చు.