: సింగపూర్ లో ‘బాహుబలి-2’ చూసేందుకు పిల్లలకు నో ఛాన్స్!
ఆసియా, యూరప్ లో చాలా దేశాల్లో ‘బాహుబలి-2’ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అదేబాటలో, సింగపూర్ సెన్సార్ బోర్డు కూడా నడిచింది. ‘బాహుబలి-2’కి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో, పదహారేళ్లలోపు పిల్లలను ఈ చిత్రం చూసేందుకు థియేటర్లలోకి అనుమతించరు. ఈ నేపథ్యంలో భారత సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహ్లాని మాట్లాడుతూ, మన దేశంలో ‘బాహుబలి-2’కు ‘యు/ఏ’ సర్టిఫికెట్ జారీ చేశామని, సింగపూర్ సెన్సార్ బోర్డు మాత్రం ఈ చిత్రం హింసాత్మకంగా ఉందని భావించడంతోనే ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో సైనికుల తలలు నరికి వేసే సన్నివేశాలు ఉండటం వల్లే ‘ఏ’ సర్టిఫికెట్ రావడానికి కారణమైందన్నారు.