: తన అభిమానులతో మరోసారి రజనీకాంత్ భేటీ


సౌతిండియా సూప‌ర్ స్టార్ రజనీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌న్న ఊహాగానాలు జోరుగా ఊపందుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆ దేవుడు ఏది శాసిస్తే తాను అదే పాటిస్తానంటూ ర‌జ‌నీకాంత్ చెబుత‌ున్నప్ప‌టికీ ఆయ‌న అభిమానులు మాత్రం ర‌జ‌నీ రాజ‌కీయ ఎంట్రీపై ఆశాభావం వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ ఆయ‌న అభిమానుల‌తో వ‌రుస‌గా ఈ రోజు నాలుగోరోజు భేటీ అయ్యారు. చెన్నైలోని కోడంబాక్కంలోని రాఘవేంద్ర వెడ్డింగ్ హాల్ లో ర‌జనీకాంత్ త‌న అభిమానుల‌తో ముచ్చ‌టించారు. ఈ స‌మావేశానికి త‌మిళ‌నాడులోని ఒక్కో జిల్లా నుంచి 250 మంది అభిమానులు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. నిన్న, మొన్న అభిమానుల‌తో ఫొటోల‌కు పోజులిచ్చి వారిని ఉత్సాహ‌ప‌ర్చిన ర‌జ‌నీకాంత్ ఈ రోజు కూడా ఎంతో ఓప్పిగ్గా వాళ్లతో కల్సి ఫొటోలు దిగారు. ర‌జ‌నీకాంత్‌తో ప‌లువురు చిన్నారులు కూడా ఫొటోలు దిగారు.



  • Loading...

More Telugu News