: తెలంగాణలో మండిపోతున్న ఎండలు!
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి సమయంలోనూ వడగాలుల తీవ్రత అధికంగా ఉండడంతో అష్టకష్టాలు పడుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
ఈ రోజు తెలంగాణలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు...
- పెద్దపల్లి -45 డిగ్రీలు
- భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల- 44 డిగ్రీలు
- ఆదిలాబాద్, అసిఫాబాద్- 43 డిగ్రీలు
- జనగాం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్- 42 డిగ్రీలు
- జగిత్యాల, నల్లగొండ, నిజామాబాద్, సిద్ధిపేట, వరంగల్, హైదరాబాద్ - 41 డిగ్రీలు
- నిజామాబాద్, యాదాద్రి భువనగిరి- 40 డిగ్రీలు